పురాతన విగ్రహం స్మగ్లింగ్ కేసులో హీరోయిన్ పాత్ర

146

దిశ, సినిమా : ప్రముఖ నటి, అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్‌పై కేసు నమోదైంది. పురాతన రోమన్ శిల్పం స్మగ్లింగ్ కేసు వ్యవహారంలో తన పాత్ర ఉన్నట్లు సమాచారం. తన పేరు మీదనే ఇటలీ నుంచి కాలిఫోర్నియాకు ఈ పురాతన విగ్రహం స్మగ్లింగ్ చేయబడినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. దిగుమతిదారు అడ్రస్ ‘కిమ్ కర్దాషియన్ డీబీఏ నోయెల్ రాబర్ట్స్ ట్రస్ట్, ఉడ్‌లాండ్ హిల్స్, కాలిఫోర్నియా’ అని ఉండగా.. ఈ అడ్రస్ కిమ్ మాజీ భర్త కాన్యే వెస్ట్ రియల్ ఎస్టేట్ కొనుగోళ్లతో ముడిపడి ఉందని తెలుస్తో్ంది.

అయితే ఈ శిల్పం స్మగ్లింగ్ వ్యవహారాన్ని ఖండించారు కిమ్. అనుమతి లేకుండా తన పేరును ఉపయోగించి విగ్రహం కొనుగోలు చేసి ఉంటారని, ఇందుకు సంబంధించిన లావాదేవీల గురించి తనకు తెలియదని కిమ్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని, త్వరలో ఆ విగ్రహం అసలు యజమానుల దగ్గరకు వెళ్తుందని ఆశిస్తున్నామని అన్నారు.