కిమ్ ప్రాణాలతోనే ఉన్నారు!

by  |
కిమ్ ప్రాణాలతోనే ఉన్నారు!
X

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై పలు రకాల ఊహాగాలు వినిపిస్తున్న నేపథ్యంలో దక్షిణ కొరియా అధ్యక్షుడి భద్రతా సలహాదారు మూన్ చుంగ్ ఇన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కిమ్ బతికే ఉన్నాడని, ఆరోగ్యంగా ఉన్నట్లు ఆదివారం సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఉత్తర కొరియా తూర్పు ప్రాంతంలోని వోన్సాన్ ప్రాంతంలోని ఓ రిసార్ట్ టౌన్‌లో ఏప్రిల్ 13 నుంచి కిమ్ ఉంటున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎటువంటి అనుమానాస్పద కదిలికలు లేవన్నారు.

ఏప్రిల్ 15న, కిమ్ తన తాత ఇల్ సంగ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనకపోవడంతో, అప్పటి నుంచి అతని ఆరోగ్యంపై రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి. కిమ్ చివరి సారిగా ఏప్రిల్ 11న తమ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్నారు. అప్పటి నుంచి కిమ్ కనిపించకుండ పోయారు. అయితే ఫైటర్ విమానాలను పరిశీలించేందుకు కిమ్ వెళ్లాడని అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే 38నార్త్ అనే వెబ్‌సైట్ తాజాగా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో కిమ్ కోసం ఉపయోగించే రైలు కనిపించింది. అది వోన్సాన్ ప్రాంగణంలోని లీడర్‌షిప్ రైల్వే స్టేషన్‌లో ఈ నెల 21,23 తేదీల్లో ఆగినట్లు ప్రకటించింది. ఒక వేళ కిమ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లయితే రైలు అక్కడ ఉండే అవకాశం లేదని 38నార్త్ వెబ్‌సైట్ ప్రకటించింది. ఇక 2014లోనూ కిమ్ ఆరువారాల పాటు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.

Tags: kim, north korian prasident, good condition, Moon Chung In


Next Story

Most Viewed