బ్రేకింగ్ న్యూస్ : కలకలం రేపుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్, హత్య..

by Batti.Sumithra |   (  Updated:2021-08-07 03:48:13  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ భాస్కర్ కిడ్నాప్, హత్య కలకలం రేపుతోంది. విజయ్ భాస్కర్ కనిపించకపోవడంతో ఆయన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విజయ్ భాస్కర్ నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ సీసీ ఫుటేజీ ఆధారంగా నలుగురు కారులో కిడ్నాప్ చేసిన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు  విజయ్ భాస్కర్‌ను నలుగురు  హత్య చేసినట్లు తెలుసుకున్నారు. విజయ్ భాస్కర్‌ను [&hellip;]</p>

MPTC husband brutally murder
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ భాస్కర్ కిడ్నాప్, హత్య కలకలం రేపుతోంది. విజయ్ భాస్కర్ కనిపించకపోవడంతో ఆయన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విజయ్ భాస్కర్ నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ సీసీ ఫుటేజీ ఆధారంగా నలుగురు కారులో కిడ్నాప్ చేసిన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు విజయ్ భాస్కర్‌ను నలుగురు హత్య చేసినట్లు తెలుసుకున్నారు. విజయ్ భాస్కర్‌ను హత్య చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేసి విచారించారు.

నెల్లూరు జిల్లాకు చెందిన గురూజీ త్రిలోక్ నాథ్ బాబా అక్రమాలను బయట పెట్టినందుకు, విదేశాల నుంచి డబ్బులు తెప్పించకపోవడంతో విజయ్ భాస్కర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. విజయ్ భాస్కర్‌ను కిడ్నాప్ చేసిన తరువాత శ్రీశైలం తీసుకెళ్లిన దుండగులు హత్య చేసి, సున్నిపెంటలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం బాబా పరారీలో ఉండగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాబా దొరికితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Next Story