పవర్ స్టార్‌ను కలిసిన సుదీప్

by  |
పవర్ స్టార్‌ను కలిసిన సుదీప్
X

దిశ, వెబ్‌డెస్క్:

రాజమౌళి ‘ఈగ’ సినిమాలో విలన్‌గా మెప్పించిన కన్నడ హీరో కిచ్చా సుదీప్.. ‘సైరా’ సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. అటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న సుదీప్.. తాజాగా జనసేన అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా పవన్‌కు ఓ మొక్కను బహూకరించిన సుదీప్.. ఆయనను కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగివుండే తత్వం ఉన్న పవన్‌ను కలవడం ఆనందంగా ఉందని చెప్పాడు. తనతో ఇంటరాక్ట్ అవ్వడం అద్భుతంగా అనిపించిందని చెప్పాడు.

దాదాపు గంట పాటు పలు సామాజిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తమ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. కాగా వీరిద్దరి పుట్టినరోజు కూడా ఒకే రోజు(సెప్టెంబర్ 2) కావడం విశేషం.



Next Story

Most Viewed