ఆ హీరోతో రోమాన్స్ విషయాలు బయటపెట్టిన హీరోయిన్

by  |
ఆ హీరోతో రోమాన్స్ విషయాలు బయటపెట్టిన హీరోయిన్
X

దిశ, సినిమా : కబీర్ సింగ్ హీరోయిన్ కియారా అద్వానీ.. పాండమిక్ టైమ్‌లోనూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసింది. ఓటీటీలో రిలీజైన ‘లక్ష్మి, షేర్‌షా’ వంటి సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ విషయాలు పంచుకున్న భామ.. కోస్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ పుకార్లపై స్పందించింది. ఈ సందర్భంగా ‘షేర్‌షా’ మూవీలో సిద్ధార్థ్‌‌తో ఆన్ స్ట్రీన్ కెమిస్ట్రీ మ్యాజిక్ క్రియేట్ చేయడానికి గల కారణమేంటి? అని అడిగినప్పుడు ఇంట్రెస్టింగ్‌గా సమాధానమిచ్చింది. ‘నిజాయితీగా చెప్పాలంటే.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీని ఎవరూ సృష్టించలేరు. ఆ కథకు సంబంధించిన పర్టిక్యులర్ సీన్‌లో పేపర్‌పై ఏం రాయబడిందో.. యాక్టర్స్ అదే చేస్తారు. తెరపై చూసినప్పుడు ఆడియన్స్‌కు ఆ ఫీల్ కనపబడుతుంది అంతే’ అని చెప్పింది. పైగా వారి(డింపుల్, విక్రమ్) జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే సీన్లు చిత్రీకరించామని తెలిపింది. ఇక సిద్ధార్థ్‌ వండర్‌ఫుల్ యాక్టర్, కోస్టార్ అంటూ కితాబిచ్చిన కియారా.. అలాంటి వారితో పనిచేయడం చాలా ఈజీగా ఉంటుందని అభిప్రాయపడింది.



Next Story

Most Viewed