'పుష్ప' ఐటెం గార్ల్‌గా కియారా

by  |

<p>దిశ, వెబ్‌డెస్క్: కియారా అద్వానీ&#8230; చార్మింగ్ బ్యూటీ. &#8216;అర్జున్ రెడ్డి&#8217; రీమేక్ &#8216;కబీర్ సింగ్‌&#8217;లో ప్రీతిగా కుర్రకారు మనసు దోచేసిన కియారా&#8230; బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది. వెబ్ సిరీస్‌లోనూ తన సత్తా చాటుతున్న కియారా&#8230; నటిగా నిరూపించుకునేందుకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోనని చెప్తూ ఉంటుంది. &#8216;భరత్ అను నేను&#8217; సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్న భామ&#8230; ఆ వెంటనే &#8216;వినయ విధేయ రామ&#8217; సినిమాతో డిజాస్టర్‌ను చవిచూసింది. [&hellip;]</p>

పుష్ప ఐటెం గార్ల్‌గా కియారా
X

దిశ, వెబ్‌డెస్క్: కియారా అద్వానీ… చార్మింగ్ బ్యూటీ. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్‌’లో ప్రీతిగా కుర్రకారు మనసు దోచేసిన కియారా… బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది. వెబ్ సిరీస్‌లోనూ తన సత్తా చాటుతున్న కియారా… నటిగా నిరూపించుకునేందుకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోనని చెప్తూ ఉంటుంది. ‘భరత్ అను నేను’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్న భామ… ఆ వెంటనే ‘వినయ విధేయ రామ’ సినిమాతో డిజాస్టర్‌ను చవిచూసింది. దీంతో తెలుగు సినిమాలకు కమిట్ అయ్యేందుకు కాస్త ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది.

అయితే సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప’ సినిమా కోసం ఎలాగైనా కియారాను ఒప్పించాలని చూస్తున్నాడట సుక్కు. సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. అదే ట్రెండ్‌ను ఈ సినిమాలో ఫాలో అవుతున్న సుక్కు… ‘పుష్ప’ ఐటెం గార్ల్‌గా కియారాను తీసుకుని ప్రేక్షకులకు కిక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. ఇప్పటికే కియారాను సంప్రదించినట్లు సమాచారం కాగా… దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే అభిప్రాయపడుతున్నారు. ‘పుష్ప’ ఫస్ట్ లుక్‌లో బన్నీ రఫ్ లుక్‌కు భారీ రెస్పాన్స్ రాగా… సినిమాలో రష్మిక మందనా హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి పారెస్ట్ ఆఫీసర్‌గా నటిస్తుండగా… తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Tags: Kiara Advani, Bollywood, Pushpa, Allu Arjun, Sukumar

Next Story