- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేరు మార్చుకున్న కియా
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ భారత వ్యాపారంలో అధికారికంగా పేరు మార్చుకున్నట్టు సోమవారం ప్రకటించింది. ఇప్పటివరకు కియా మోటార్స్‌గా ఉన్న పేరును ఇకమీదట ‘కియా ఇండియా’గా మార్చుకున్నట్టు వెల్లడించింది. కంపెనీ కొత్త బ్రాండింగ్, స్థిరమైన మొబిలిటీ పరిష్కారాల్లో భాగంగా కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కార్పొరేట్ ఐడెంటిటీగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతులను అనుసరించే పేరులో మార్పులు చేసినట్టు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ భారత వ్యాపారంలో అధికారికంగా పేరు మార్చుకున్నట్టు సోమవారం ప్రకటించింది. ఇప్పటివరకు కియా మోటార్స్‌గా ఉన్న పేరును ఇకమీదట ‘కియా ఇండియా’గా మార్చుకున్నట్టు వెల్లడించింది. కంపెనీ కొత్త బ్రాండింగ్, స్థిరమైన మొబిలిటీ పరిష్కారాల్లో భాగంగా కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కార్పొరేట్ ఐడెంటిటీగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతులను అనుసరించే పేరులో మార్పులు చేసినట్టు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతరపురంలో గల ఉత్పత్తి ప్లాంట్‌లో కంపెనీ తన లోగో, పేరును మార్చింది. దశలవారీగా తన డీలర్‌షిప్‌లలో ఈ మార్పులు చేయనున్నట్టు వివరించింది. ఈ ఏడాది ప్రారంభంలో కియా తన కొత్త కార్పొరేట్ లోగో, గ్లోబల్ బ్రాండ్ విధానాలను ప్రకటించింది. దేశీయంగా గత సంవత్సరన్నర కాలంలో కియా నాలుగో అత్యధికంగా అమ్ముడైన కార్ బ్రాండ్‌గా నిలిచింది. అలాగే, దేశంలో అత్యంత వేగంగా 2.5 లక్షల అమ్మకాలను సాధించిన కార్ల తయారీ కంపెనీగా నిలిచింది.






