ఫ్యామిలీతో కలిసి పని చేయాలనుంది: ఖుషీ

by  |
ఫ్యామిలీతో కలిసి పని చేయాలనుంది: ఖుషీ
X

అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ సినిమాల్లో నటించేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. తల్లి శ్రీదేవి, సోదరి జాన్వీ కపూర్ లాగే తనను తాను నటిగా ప్రూవ్ చేసుకునేందుకు ఆరాటపడుతున్నది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ‌లో యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుంటున్న ఖుషీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

హాయ్ నేను ఖుషి కపూర్ అంటూ మొదలైన వీడియోలో తన కుటుంబం వ్యాపారంలో ఉందని చెప్పింది. తాను వ్యాపారానికి దూరంగా ఉన్నాను అని చెప్తుంది. తన కుటుంబంతో కలిసి పనిచేయాలని ఉందని.. కానీ, అంతకు ముందు తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటుంది. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకోవాలి అని అనుకుంటున్నట్లు తెలిపింది ఖుషీ.

ప్రస్తుతం న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో క్లాసులను ఆనందిస్తున్నాను అని చెప్తున్న ఖుషీ.. నటనలో నైపుణ్యం కోసం శ్రమించడం సంతోషంగా ఉందని అంటుంది. యాక్టింగ్‌ను లవ్ చేసే తాను.. సినిమాల కోసం పనిచేసేందుకు చాలా ఆతృతగా ఉన్నట్లు చెప్తుంది.



Next Story

Most Viewed