ఫుల్ స్పీడ్ మీదున్న ‘ఖిలాడీ’ రవితేజ

by  |
Khiladi
X

దిశ, వెబ్‌డెస్క్ : సీనియర్ స్టార్ రవితేజ ఫుల్ స్పీడ్ మీదున్నారు. క్రాక్ హిట్‌తో సక్సెస్ స్పీడ్ ని కంటిన్యూ చేస్తున్నారు రవితేజ. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రవితేజ .. ఖిలాడీగా స్మార్ట్ గేమ్ ఆడబోతున్నారు. స్మార్ట్ గేమ్ ఆడితే ఓడిపోవని చెబుతున్న రవితేజ మరి ఈ ఆట ఎంత స్మార్ట్ గా ఉందో…

మాస్ మహారాజా రవితేజ సినిమాల స్పీడ్ పెంచేశారు. క్రాక్ తో సూపర్ హిట్ కొట్టి.. అస్సలు గ్యాప్ లేకుండా వరసగా సినిమాల్ని లైన్లో పెట్టిన రవితేజ.. ఖిలాడీలో స్మార్ట్ గా తన ఆట శాంపిల్ చూపించారు. రమేష్ వర్మ డైరెక్షన్లో రవితేజ డ్యూయల్ రోల్ లో డబుల్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ తో రాబోతున్న సినిమా టీజర్ ఆడియన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తోంది.

డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ మధ్యనే ఇటలీ లో పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ని ట్రెయిన్డ్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ తో షూటింగ్ చేసొచ్చిన రవితేజ అండ్ బ్యాచ్ ఖిలాడీలో ఫుల్ యాక్షన్ యాంగిల్ ని చూపిస్తున్నారు. క్రాక్ లో యాక్షన్ తో ఎంటర్ టైన్ చేసిన రవితేజ.. ఖిలాడీ సినిమాలో ఆ డోస్ ని డబుల్ చేసి చూపించబోతున్నారు.

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఖిలాడీ సినిమాలో రవితేజ .. రెండు క్యారెక్టర్స్ లో ఎంటర్ టైన్ చెయ్యబోతున్నారు. రిలీజ్ అయిన టీజర్ లో స్టోరీకి సంబందించి చిన్న హింట్ ఇవ్వకుండా షార్ప్ గా, థ్రిల్లింగ్ గా ఎంగేజ్ చేశారు. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మిలియన్ మార్క్ దాటేసిన టీజర్.. సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. క్రాక్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ .. ఖిలాడీ సినిమాని మే 28 న రిలీజ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed