ఫస్ట్ గ్లింప్స్‌తో రవితేజకి ‘ఖిలాడి’ బర్త్ డే విషెస్

by  |
ఫస్ట్ గ్లింప్స్‌తో రవితేజకి ‘ఖిలాడి’ బర్త్ డే విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహరాజా రవితేజ ‘క్రాక్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. సంక్రాంతికి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో వస్తున్న ‘ఖిలాడి’ నుంచి రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. స్టైలిష్ లుక్‌లో ఉన్న రవితేజ చేతిలో సుత్తితో విలన్లపై అటాక్‌కు వెళ్తున్న వీడియో ఆకట్టుకుంటోంది. రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్న సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లు కాగా, ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Next Story

Most Viewed