‘కేజీఎఫ్ 2’ విడుదల ఈ ఏడాదేనా?

by  |
‘కేజీఎఫ్ 2’ విడుదల ఈ ఏడాదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ రాక్‌స్టార్ యశ్ నటించిన ‘కేజీఎఫ్’ సినిమా దక్షిణాది ప్రేక్షకులనే కాదు.. బాలీవుడ్ ఆడియెన్స్‌ను కూడా మెస్మరైజ్ చేసింది. దీనికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ఆ రేంజ్ ఎక్స్‌‌పెక్టేషన్స్‌తో ఎదురుచూస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు సినిమా విడుదల తేదీపై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో క్లారిటీనిచ్చింది ‘కేజీఎఫ్-2’ మూవీ యూనిట్.

కరోనా కారణంగా భారీ భారీ ప్రాజెక్టులన్నీ వాయిదా పడ్డాయి గానీ, లేదంటే ఈపాటికే ‘కేజీఎఫ్-2’ మూవీ విడుదలై ఉండేది. ఇప్పటికే స్టార్ కాస్టింగ్‌తో పాటు తొలి చాప్టర్ సృష్టించిన సంచలనంతో రెండో పార్ట్‌పై అటు ప్రేక్షకుల్లో, ఇటు చిత్ర పరిశ్రమలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో.. కేజీఎఫ్ 2 విడుదల తేదీకి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడలేదు. కానీ, ఆ చిత్ర దర్శకుడే స్వయంగా ఓ హింట్ ఇవ్వడంతో.. రిలీజ్ ఈ ఏడాదే ఉండబోతుందనే క్లారిటీ వచ్చేసింది. కేజీఎఫ్ చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్ పుట్టినరోజు (శనివారం) సందర్భంగా ప్రశాంత్ నీల్ విజ‌య్‌కు విషెస్ చెబుతూ ‘అతడు బిగ్ డ్రీమ్స్‌ను టార్గెట్‌గా పెట్టుకోవడమే కాకుండా.. తన చుట్టూ ఉన్న వారిని కూడా ఆ విధంగా ఆలోచించేలా ప్రభావితం చేస్తాడు. నాకు తెలుసు.. ఈ సంవత్సరం మనకు ఎంత పెద్దదో.. విష్ యూ హ్యాపీ బర్త్ డే టూ యూ సర్’ అని మెసేజ్ చేశాడు. దాంతో.. కేజీఎఫ్ 2 ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పకనే చెప్పాడు. కరోనా సమయంలోనూ థియేటర్‌లో కాసుల వర్షం కురిపించి.. కేజీఎఫ్ 2 చరిత్ర సృష్టిస్తుందా అన్నది వేచి చూడాలి.



Next Story

Most Viewed