‘కేజీఎఫ్ 2’ టీజర్ అప్‌డేట్

by  |
‘కేజీఎఫ్ 2’ టీజర్ అప్‌డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా వైడ్‌గా సినీఅభిమానులను విశేషంగా ఆకట్టుకున్న చిత్రం ‘కేజీఎఫ్’. మొదటి భాగం సృష్టించిన రికార్డుల నేపథ్యంలో.. దీనికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ‘కేజీఎఫ్ 2’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మూవీకి సంబంధించిన ప్రతీ చిన్న అప్‌డేట్ అభిమానులను ఖుషీ చేస్తుండగా, ఫ్యాన్స్ కోసం మరో ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమైంది కేజీఎఫ్ టీమ్. ఈ క్రమంలో నేడు (సోమవారం) ‘కేజీఎఫ్ 2’ నుంచి యష్ పోస్ట‌ర్‌ విడుదల చేసిన మూవీ మేకర్స్.. ‘కేజీఎఫ్ 2 సామ్రాజ్యంలోకి స్వాగతం’ అంటూ ఓ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. కాగా జనవరి 8న రాకింగ్ స్టార్ యష్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 10.08 గంటలకు టీజర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సంజయ్‌దత్ పవర్‌పుల్ క్యారెక్టర్‌ ప్లే చేస్తుండగా, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా రవి బాస్రుర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Next Story

Most Viewed