- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఐబొమ్మ’ కేసులో కీలక పరిణామం.. పోలీసు కస్టడీకి నిందితుడు రవి
ఐబొమ్మ (Ibomma) నిర్వాహకుడు ఇమంది రవి (Ravi)కి మరో బిగ్ షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: ఐబొమ్మ (IBomma) నిర్వాహకుడు ఇమంది రవి (Ravi)కి మరో బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు అరెస్ట్ అయిన అతడికి నాంపల్లి కోర్టు (Nampally Court) ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్‌లో కీలక సూత్రధారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత వారం రోజుల పాటు రవిని కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా.. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇమంది రవిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించారు.
కాగా, కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు, ఓటీటీ వేదికల్లోని కంటెంట్‌ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ప్రధాన నిందితుడు ఇమంది రవిని ఎట్టకేలకు హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ఐ బొమ్మ, బప్పం, ఐ విన్, బప్పం, ఐ రాధ టీవీ పేర్లతో వెబ్‌సైట్‌లు రూపొందించి గత ఏడేళ్లుగా పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు వేదికగా మార్చిన ఇమ్మడి రవి (40)ని శనివారం కూకట్‌పల్లిలో అరెస్ట్ చేశారు. ఇతడు నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో రూ.3 కోట్ల నగదు, వందల కొద్దీ హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లను కూడా గుర్తించి. నిందితుడిని బషీర్‌బాగ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)కు తరలించి కీలక సమాచారం సేకరించారు. ఈ మేరకు ఇవాళ నిందితుడిన నాంపల్లి కోర్టులో మరోసారి హాజరుపరిచారు.






