ఆర్మీ జవాన్ భార్య రాసలీలలు: బోర్డర్ కి వెళ్లిన భర్త.. వచ్చేసరికి అతడితో బిడ్డను కని

by  |
ఆర్మీ జవాన్ భార్య రాసలీలలు: బోర్డర్ కి వెళ్లిన భర్త.. వచ్చేసరికి అతడితో బిడ్డను కని
X

దిశ, వెబ్‌డెస్క్: భార్యాభర్తల బంధం ఎప్పుడు నమ్మకం, ప్రేమ మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది లేకపోయినా ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదు. ఇక ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు కుటుంబాలలో చిచ్చు పెడుతున్నాయి. దీంతో కుటుంబాలలో కలతలు రేగి కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.. మరికొన్నిజంటలు కోర్టులో విడాకుల కోసం ఎదురుచూస్తున్నాయి. తాజాగా ఒక వ్యక్తి తన భార్యపై కోర్టులో సంచలన ఆరోపణలు చేశాడు. తన భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రిని తాను కాదని, ఆమె తన సోదరి భర్తతో ఆ బిడ్డను కన్నదని ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలనీ కోర్టుకెక్కాడు. ఈ కేసుపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

వివరాలలోకి వెళితే.. తిరువనంతపురంకు చెందిన ఆర్మీ జవాన్ కి 2006 లో పక్క గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. పెళ్లైన 22 రోజుల తర్వాత అతడు ఉద్యోగ నిమిత్తం లడఖ్ వెళ్లాడు. అయితే ఈ 22 రోజులలో గానీ, ఆ తర్వాత గానీ అతడు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోలేదు. ఈ నేపథ్యంలోనే 2017 లో ఇంటికి వచ్చేసరికి భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. తన భార్యను తాను ముట్టుకోనేలేదని, ఆమె ఎవరి వలనో గర్భవతి అయ్యిందని ఆరోపిస్తూ కోర్టులో విడాకులకు పిటిషన్ పెట్టాడు. ఆ సమయంలోనే అతడు బిడ్డకు, తనకు డీఎన్ఎ టెస్టులు జరపాలని, అలాగే తనతో పాటు భార్య సోదరి భర్తకు కూడా పరీక్షలు జరపాలని కోరాడు. తన భార్యకు ఆమె సోదరి భర్తతో అఫైర్ ఉందని, ఆ బిడ్డకు తండ్రి నాకు తమ్ముడి వరుస అయ్యే అతనేనని పిటిషన్ లో పేర్కొన్నాడు.

ఇక ఈ కేసు విచారణలో పలు కీలక ఆధారాలను కూడా జవాన్ సమర్పించాడు. తనకు ఇన్‌ఫెర్టిలిటీ ఉందని, తన స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం వల్ల తండ్రి కావడం కష్టమని డాక్టర్స్ చెప్పడంతో మందులు వాడెవడినని తెలిపాడు. అందుకే తన భార్యతో శారీరక సంబంధం పెట్టుకోలేదని తెలుపుతూ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ని సబ్మిట్ చేశాడు. ఇక ఆధారాలను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తులు ముహమ్మద్ ముస్తాక్, కౌసర్ ఎడప్పగాత్‌లతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది, డీఎన్ఏ టెస్టుకు అనుమతిస్తూ.. పిటిషనర్ భార్యకు జన్మించిన బిడ్డ(మైనర్).. ఇందులో బాధితుడు కాదని తేల్చి చెప్పింది. ఎటువంటి పరిస్థితిలోను ఆ బిడ్డను ఈ కేసులో ఆధారంగా తీసుకోవద్దని హెచ్చరించింది. తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో DNA పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.

అవకాశాల కోసం నిర్మాతతో ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఏకంగా అక్కడే


Next Story

Most Viewed