ఆసక్తి రేపుతున్న ‘సాని కాయిదం’ ఫస్ట్ లుక్

by  |
ఆసక్తి రేపుతున్న ‘సాని కాయిదం’ ఫస్ట్ లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సాని కాయిదం’. రాఘవన్‌కు జోడీగా జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ నటిస్తుండగా.. అరుణ్ మాథేశ్వరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన హీరో, హీరోయిన్ల ఫస్ట్ లుక్‌ను కీర్తీ సురేష్ తాజాగా తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

1980లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాక్షన్ సినిమా డ్రామా’ ఇది. ‘పొదుపెట్టై, 7జీ బృందావన కాలనీ’ చిత్రాలతో తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్న సెల్వ రాఘవన్ తొలిసారి కెమెరా ముందు నటిస్తున్నాడు. ఇక ఫస్ట్ లుక్ విషయానికొస్తే.. కీర్తి, సెల్వరాఘవన్‌ రక్తాలు కారుతూ కనిపిస్తుండగా, వారి ముందు రక్తమోడుతున్న పలు రకాల కత్తులున్నాయి. మరి ఆ ఇద్దరూ కలిసి ఎందుకోసం యుద్ధం చేస్తున్నారు? వాళ్ల ప్రాణాలు రక్షించుకోవడానికా? లేదా వారికి అన్యాయం చేసిన వారి మీద పగ తీర్చుకోవడానికా? అన్నది తెలియాల్సి ఉంది.‘సన్ని కాయిదం’ ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తి రేపుతుండటంతో పాటు అంచనాలు కూడా పెంచేస్తోంది. కీర్తి లుక్ చూస్తే నిజంగానే మరో జాతీయ అవార్డు సొంతం చేసుకుంటుందని తన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కీర్తి ఖాతాలో మరో సెన్సేషనల్ హిట్ పక్కా అని అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూరుస్తున్నాడు.

Next Story

Most Viewed