కీర్తి మరో బయోపిక్ చేయనుందా?

by Jakkula Samataha |

<p>మహానటి&#8230;. అంటే ఇంతకు ముందు సావిత్రి గారు గుర్తొచ్చేవారు. కానీ ఇప్పుడు ఆమె పాత్రలో నటించి జీవం పోసిన నేటి మహానటి కీర్తి సురేష్ గుర్తుకు వస్తున్నారు. అంతలా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి&#8230; సావిత్రిని మరపించింది కీర్తి. అలనాటి మహానటి సహజ నటనకు ఎలాంటి అవార్డులు దక్కక పోయినా&#8230; ఆ పాత్రలో జీవించిన మనతరం మహానటి మాత్రం అవార్డులు వచ్చి తనచెంత వాలాయి. జాతీయ స్థాయి ఉత్తమ నటిగా నిలబెట్టాయి. సావిత్రిగా ప్రేక్షకుల మదిలో [&hellip;]</p>

కీర్తి మరో బయోపిక్ చేయనుందా?
X

మహానటి…. అంటే ఇంతకు ముందు సావిత్రి గారు గుర్తొచ్చేవారు. కానీ ఇప్పుడు ఆమె పాత్రలో నటించి జీవం పోసిన నేటి మహానటి కీర్తి సురేష్ గుర్తుకు వస్తున్నారు. అంతలా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి… సావిత్రిని మరపించింది కీర్తి. అలనాటి మహానటి సహజ నటనకు ఎలాంటి అవార్డులు దక్కక పోయినా… ఆ పాత్రలో జీవించిన మనతరం మహానటి మాత్రం అవార్డులు వచ్చి తనచెంత వాలాయి. జాతీయ స్థాయి ఉత్తమ నటిగా నిలబెట్టాయి. సావిత్రిగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన కీర్తి… తనను అలాగే గుర్తుపెట్టుకోవాలి అనే భావనలో ఇక పై ఎలాంటి బయోపిక్ లు చేయనని ప్రకటించింది.

అయితే ఆమెను మరో బయోపిక్ చేయాలని కోరుతున్నారట నటుడు నరేష్. తన తల్లి విజయ నిర్మల పాత్రకు మీరైతేనే జీవం పోయగలరని… ఈ సినిమా చేసేందుకు ఎలాగైనా ఒప్పుకోవాలని కోరారట. కథానాయకురాలిగా, దర్శకురాలిగా చిత్రసీమకు ఎనలేని సేవలు అందించిన సూపర్ స్టార్ కృష్ణ సతీమణి అయిన విజయ నిర్మల ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. అధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్ గా గిన్నీస్ బుక్ రికార్డ్ సృష్టించారు. అయితే ఆమె మరణం తర్వాత… ఆమె బయోపిక్ తీయాలనే ప్లాన్ లో ఉన్నాడట కొడుకు నరేష్. మరి ఈ ఆఫర్ ను కీర్తి ఓకే చేస్తుందా? లేదా? తెలియాల్సి ఉంది.

Tags : Mahanati, Keerthi Suresh, Savithri, Vijaya Nirmala, Naresh, Krishna

Next Story