- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"మహానటి" కారణమే… కానీ పూర్తిగా కాదు
<p>మహానటి సావిత్రి పాత్రకు జీవం పోసింది కీర్తి సురేష్. మహానటి సినిమాతో సావిత్రిని కూడా మరిపించిన కీర్తి… విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కీర్తికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో దూసుకుపోతున్న కీర్తి… అటు బాలీవుడ్ లోనూ అవకాశాలు దక్కించుకుంది. అయితే ఇదంతా మహానటి వల్లే సాధ్యం […]</p>

మహానటి సావిత్రి పాత్రకు జీవం పోసింది కీర్తి సురేష్. మహానటి సినిమాతో సావిత్రిని కూడా మరిపించిన కీర్తి… విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కీర్తికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో దూసుకుపోతున్న కీర్తి… అటు బాలీవుడ్ లోనూ అవకాశాలు దక్కించుకుంది.
అయితే ఇదంతా మహానటి వల్లే సాధ్యం అయిందని… ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది అన్నారట. దీనికి సమాధానం ఇచ్చిన కీర్తి… మహానటి వల్ల స్టార్ ఇమేజ్ వచ్చింది కానీ… ఈ ఒక్క సినిమా ద్వారానే ఓవర్ నైట్ హీరోయిన్ అయిపోలేదని తెలిపింది. ఈ స్థానానికి చేరేందుకు చాలా కష్టపడ్డానని చెప్పింది. పాత్రలను ఎంచుకోవ డంలో జాగ్రత్తలు తీసుకున్నాని… వాటిని తెరపై చూపేందుకు చాలా కష్టపడ్డాను అని తెలిపింది. ప్రస్తుతం తెలుగులో రంగ్ దే సినిమా చేస్తున్న కీర్తి … మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో పలు ప్రాజెక్ట్ లతో మన ముందుకు రాబోతోంది .
Tags: Keerthi suresh, Tollywood, Kollywood, Bollywood






