వ్యాపార రంగంలోకి కీర్తి సురేశ్.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్

by  |
వ్యాపార రంగంలోకి కీర్తి సురేశ్.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్
X

దిశ, సినిమా : హీరోయిన్ కీర్తి సురేశ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించి ఇంతకు ముందే హింట్ ఇచ్చిన కీర్తి… స్కిన్ కేర్ బ్రాండ్ అనౌన్స్ చేసింది. భూమిత్ర పేరుతో ప్రొడక్ట్స్ మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. శక్తివంతం, ప్రత్యేకం, స్వచ్ఛమైన, స్థానిక, సహజ పదార్థాలు తమ ఉత్పత్తులను సూపర్ స్పెషల్‌గా చేశాయన్న ఆమె.. 100% క్లీన్ అండ్ గ్రీన్ ప్రొడక్ట్స్ అని హామీ ఇచ్చింది. క్యురేషన్ నుంచి ప్యాకింగ్ వరకు ప్రతీ దశలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నామని వివరించింది. నాలుగు నెలలుగా దీనిపై పని చేస్తున్నామని, మీరే కాదు మీ స్కిన్ కూడా ఈ నేచురల్ ప్రొడక్ట్స్‌ను ఇష్టపడుతుందని తెలిపింది. ప్రేక్షకులు తనను, తన సినిమాలను ప్రేమించినట్లుగానే.. ఈ కొత్త వెంచర్‌కు సపోర్ట్ ఇవ్వాలని కోరింది. కాగా, కీర్తి ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉంది.



Next Story

Most Viewed