బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్ : కీర్తి

by  |
బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్ : కీర్తి
X

దిశ, వెబ్‌డెస్క్: సింపుల్ అండ్ బ్యూటిఫుల్ కీర్తి సురేష్.. ఈ తరం మహానటిగా ప్రశంసలు పొందుతోంది. ‘మహానటి’ సినిమాలో నటనకు నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి.. ఈ సినిమా తర్వాత ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. కానీ అలాంటి సినిమాలే వచ్చాయని.. కథ బాగుండటంతో ఒప్పుకున్నట్లు వెల్లడించింది. వాటితో పాటు కమర్షియల్ మూవీ ఆఫర్స్ కూడా రావడం ఒక విధంగా లక్కీ అన్న కీర్తి.. కమర్షియల్ అండ్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది.

మహిళలు ఏదైనా చేయగలరని.. వృత్తి పట్ల పాషనేట్‌గా ఉంటే ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా సక్సెస్ అవుతారని తెలిపింది. ‘మిస్ ఇండియా’ సినిమా అదే పాయింట్‌‌తో వచ్చిందని గుర్తుచేసింది. మనం ఏం చేయాలని అనుకుంటున్నామో.. లక్ష్యమేంటో తెలిసినప్పుడు.. ఎవరు కిందకు లాగినా సరే టార్గెట్ రీచ్ అవ్వడం మాత్రం పక్కా అంటోంది. సినిమాలో బాడీ లాంగ్వేజ్ కూడా ముఖ్యమేనన్న కీర్తి.. ఇది యాక్టింగ్‌లో ఒక పార్ట్ అని చెప్పుకొచ్చింది. రైట్ ఆపర్చునిటీ.. రైట్ టైమ్‌లో రావడం చాలా ఇంపార్టెంట్ అని తెలిపింది. ప్రస్తుతం రజినీకాంత్ ‘అన్నాత్తె’, మహేశ్ బాబు ‘సర్కార్ వారి పాట’తో పాటు చిరంజీవి ‘వేదాలమ్’ రీమేక్ ఆఫర్స్ అందుకుని.. మెగాస్టార్ అండ్ సూపర్ స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.


Next Story

Most Viewed