ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. బికినీలో కీర్తి ఫొటోస్ వైరల్

by  |
kirthi-pandian
X

దిశ, సినిమా : తమిళ బ్యూటీ కీర్తి పాండియన్ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అయింది. అంతకు ముందు చాలా సన్నగా కనిపించి కామెంట్స్ ఎదుర్కొన్న భామ.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో దర్శనమిచ్చింది. దీంతో అప్పటి, ఇప్పటి ఫొటోలను పోలుస్తూ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు నెటిజన్లు. కానీ సన్నగా ఉండటం వల్ల చిన్నప్పటి నుంచి ఎలాంటి ఇబ్బందులు పడిందో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది కీర్తి. ‘కీర్తి సముద్రంలో పడితే మునిగిపోదు. స్విమ్మింగ్ రాకపోయినా బతికేస్తుంది. ఎలా?’ ఎందుకంటే సన్నగా ఉంటుంది కాబట్టి మునిగిపోదు. స్కూల్లో నాపై ఈ జోక్ ఉండేది. అప్పుడు నేను కూల్‌గా నవ్వేసినా ఆ మాటలు చాలా బాధించాయి.

టీనేజ్‌కు వచ్చాక కూడా ఇలాంటి మాటలు విని చాలా ఏడ్చాను. రిలేటివ్స్, ఫ్రెండ్స్, చివరకు నేను ఎంచుకున్న కెరియర్‌లో కూడా ఇలాంటి కామెంట్స్ ఎదుర్కొన్నా. నాలో ఫాల్ట్ లేకపోయినా సరే వెయిట్ గెయిన్ చేసేందుకు డిసైడ్ అయ్యా. మెంటల్‌ లేదా ఫిజికల్‌గా మన మైండ్‌, హార్ట్‌ను సెట్ చేస్తే ఏదీ అసాధ్యం కాదని ఈ ఫిట్‌నెస్ జర్నీలోనే రియలైజ్ అయ్యా. ఆరు నెలల కఠినమైన ట్రైనింగ్, అతిగా తినడంతో అనుకున్నది సాధించా. ఉదయం 5గంటల నుంచే తినడం ప్రారంభించేదాన్ని. ఈ ప్రయాణంలో ప్రతీ 100 గ్రాముల వెయిట్ గెయిన్ కూడా నాకు బిగ్ విన్. నా కోసమే ఈ మార్పు కోరుకున్నాను. ఇతరుల ఇన్‌సెక్యురిటీస్‌ను ఫిల్ చేసేందుకు కాదు. షేప్, సైజ్, కలర్‌తో సంబంధం లేకుండా ఇంతకు ముందు కన్నా ఎక్కువగా నన్ను నేను ప్రేమించడం నేర్చుకున్నా’ అని తెలిపిన భామ.. ఈ జర్నీని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యేలా చేసిన తన టీమ్‌కు థాంక్స్ చెప్పింది.



Next Story

Most Viewed