పార్లమెంట్‌ను తప్పుదోవపట్టించిన ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’..

by  |
పార్లమెంట్‌ను తప్పుదోవపట్టించిన ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’..
X

దిశ, సినిమా: ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ షోలో రాంగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆరోపణలు లేవనెత్తాయి. 12 సీజన్లు పూర్తి చేసుకుని 13వ సీజన్ ప్రసారమవుతుండగా, ఫస్ట్ టైమ్ తప్పుడు ప్రశ్న-సమాధానం అనే సందేహాన్ని వ్యక్తం చేశాడు ఓ నెటిజన్. అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశాడు షో ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ బసు. సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో హోస్ట్ అమితాబ్ బచ్చన్ ‘ఇండియన్ పార్లమెంట్ సెషన్స్ దేనితో ప్రారంభవుతాయి? (ఎ). జీరో హవర్ (బి). క్వశ్చన్ హవర్ (సి). లెజిస్లేటివ్ బిజినెస్ (డి). ప్రివిలేజ్ మోషన్’ అని ప్రశ్నించాడు. దీనికి సరైన సమాధానం క్వశ్చన్ హవర్ అని ప్రసారం చేశారు. కాగా ఇది ఇన్‌కరెక్ట్ అంటూ ట్వీట్ చేశాడు ఓ నెటిజన్.

నార్మల్‌గా లోక్‌సభ జీరో హవర్‌తో.. రాజ్యసభ క్వశ్చన్ హవర్‌తో ప్రారంభమవుతుందని దయచేసి చెక్ చేయాలని సూచించాడు. దీనిపై స్పందించిన నిర్మాత సిద్ధార్థ్ బసు.. ‘ఏ లోపం లేదు. దయచేసి లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు ఇచ్చే హ్యాండ్‌బుక్‌లను చెక్ చేయండి. ఉభయ సభలలో స్పీకర్/చైర్‌పర్సన్ నిర్దేశించకపోతే, సమావేశాలు సంప్రదాయబద్ధంగా క్వశ్చన్ హవర్‌తో ప్రారంభమవుతాయి. తర్వాత జీరో అవర్ ఉంటుంది’ అని ట్వీట్ చేశాడు. తప్పుగా అర్థం చేసుకునేందుకు ఆస్కారమే లేదన్న ఆయన.. లోపం లేనప్పుడు దాన్ని చూడకుండా ఉండటం విచిత్రంగా అనిపిస్తుందన్నాడు. ఈ క్రమంలో నెటిజన్ లోక్‌సభ, రాజ్యసభ విధివిధానాలు అంటూ స్క్రీన్ షాట్స్ షేర్ చేశాడు.



Next Story

Most Viewed