అమితాబ్‌తో కంటెస్టెంట్ ఫ్లర్టింగ్.. కేబీసీని ఆపాలంటూ రిక్వెస్ట్

by  |
Amithab
X

దిశ, సినిమా : సోని ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్.. ‘కౌన్ బనేగా క్రోర్‌పతి సీజన్ 13’ లేటెస్ట్ ప్రోమోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కంటెస్టెంట్ నమ్రత అందాన్ని పొగుడుతూ, ఆమె ధరించిన నెక్లెస్‌ బాగుందన్న అమితాబ్ కాంప్లిమెంట్స్‌తో ప్రోమో ప్రారంభమైంది. ఈ క్రమంలో బిగ్ బీని మిమ్మల్ని ‘అమిత్ జీ’ అని పిలవచ్చా? అని నమ్రత అడిగితే.. జస్ట్ అమిత్‌ అనండి చాలు అంటూ ఆయన రిప్లయ్ ఇచ్చారు. అంతేకాదు నమ్రతతో చాయ్ తాగేందుకు బయటికి వెళ్లాలనుకుంటున్నాను. కొద్దిసేపు షోకు బ్రేక్ ఇవ్వండని ప్రొడ్యూసర్‌ను రిక్వెస్ట్ చేశారు. ఇక షోలో భాగంగా ‘కళంక్’ మూవీ నుంచి ‘ఘర్ మోరే పరదేశియా’ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన నమ్రతను.. ఇన్నిసార్లు తిరిగారు కదా, మీకు తల తిరగడం లేదా? అని ప్రశ్నించాడు. దీనికి ‘మీ కళ్లు ఒకదానిపైనే దృష్టి కేంద్రీకరిస్తే తల తిరగదు’ అని రిప్లయ్ ఇచ్చింది. ఫైనల్‌గా మీరు యంగ్‌గా కనిపిస్తున్నారంటూ అమితాబ్‌కు కాంప్లిమెంట్స్ ఇచ్చింది.

Next Story

Most Viewed