తెరపై రణ్‌వీర్, కత్రినా రొమాన్స్?

by  |
తెరపై రణ్‌వీర్, కత్రినా రొమాన్స్?
X

రణ్‌వీర్ సింగ్, కత్రినా కైఫ్‌ల జోడీని తెరపై చూసేందుకు బాలీవుడ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీని వెండితెరపై వీక్షించేందుకు ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ క్రేజీ స్టార్స్‌ జంటగా సినిమా వర్కౌట్ కాలేదు. సూర్యవంశీ, సింబా లాంటి చిత్రాల్లో క్లైమాక్స్‌లో కనువిందు చేసినా.. ఇద్దరూ కలిసి ఫుల్‌లెంత్ రోల్స్ చేయలేకపోవడం గమనార్హం. ‘83’ సినిమాలో రణ్‌వీర్ సరసన కత్రినా చేస్తుందని అనుకున్నా.. చివరి నిమిషంలో ఆ పాత్రకు దీపికా సెలెక్ట్ అయిపోయింది. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు బాలీవుడ్ టాక్.

డైరెక్టర్ జోయా అక్తర్, రణ్‌వీర్ సింగ్ కలయికలో దిల్ ధడ్కనే దో, గల్లీ బాయ్ చిత్రాలు రాగా, ఇదే కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కబోతోందట. రణ్‌వీర్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న ఈ సినిమాకు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట జాయ్‌ఫుల్ స్టార్. లాక్‌డౌన్ ఎత్తేయగానే ఇప్పటి వరకు కమిటైన సినిమాలకు డేట్స్ సర్దుబాటు చేశాక.. ఈ అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌లో ఎంటర్ కానున్నాడట రణ్‌వీర్.

కత్రినా, రణ్‌వీర్ తొలిసారిగా రొమాన్స్ చేయబోతున్న ఈ చిత్రంలో పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుందట కాట్స్. ఈ క్యారెక్టర్ రణ్‌వీర్ పాత్రకు సపోర్ట్ చేసేలా ఉంటుందని తెలుస్తోంది. కత్రినా, జోయా మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. దీంతో జోయా చెప్పిన స్టోరీకి వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ఎనర్జిటిక్ హీరో రణ్‌వీర్‌తో కలిసి నటించేందుకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కత్రినా కోరిక.. మొత్తానికి ఆ సినిమాతో తీరబోతుందన్న మాట.

Next Story

Most Viewed