‘బస్తీ బాలరాజు’ కోలీవుడ్‌లో దస్తీ

by  |
‘బస్తీ బాలరాజు’ కోలీవుడ్‌లో దస్తీ
X

Rx100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో కార్తికేయ.. యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించాడు. కానీ తర్వాత చేసిన సినిమాలు అంతగా కలిసి రాకా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో కార్తికేయ విలనిజంకు మంచి మార్కులే పడ్డాయ్. కార్తికేయ యాక్టింగ్‌కు విమర్శకుల ప్రశంసలు అందాయి. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చావు కబురు చల్లగా చిత్రం చేస్తున్న కార్తికేయ.. ఫుల్‌మాస్ రోల్‌లో కనిపించబోతున్నాడు. బస్తీ బాలరాజుగా ప్రేక్షకులను అలరించబోతున్నాడు.

కార్తికేయ కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. సూపర్ స్టార్, తాలా అజిత్ హీరోగా వస్తున్న ‘వలిమై’ చిత్రంలో కీలకపాత్రలో కనిపించబోతున్నాడని టాక్. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మార్చ్‌లో జరిగే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. గ్యాంగ్ లీడర్‌తో విలన్‌గా మెప్పించిన కార్తికేయ… కోలీవుడ్‌ను కూడా మెప్పిస్తే కెరియర్ సాఫీగా సాగిపోయినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లోనూ బిజీ అయిపోయినట్లే.


Next Story

Most Viewed