శ్రీ‌వారికి కార్తీక స‌హ‌స్ర దీపోత్స‌వం

177

దిశ,విశాఖపట్నం: తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్ రోడ్‌లోని ఎంజిఎం గ్రౌండ్స్‌లో శ్రీ‌వారి కార్తీక స‌హ‌స్ర దీపోత్స‌వ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డితో పాటు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌, విశాఖ శ్రీశారదాపీఠం స్వామీజి స్వరూపానందేంద్ర, ఉత్తరాధికారి స్వామీ స్మాత్మానందేంద్ర హాజరై కార్తీక దీపాత్సోవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోవిడ్-19 నేప‌థ్యంలో భౌతిక‌దూరం పాటిస్తూ 800 మంది మ‌హిళ‌లు దీపాలు వెలిగించేలా ఏర్పాటుచేశారు. వేదిక‌ను శోభాయ‌మానంగా పుష్పాల‌తో, విద్యుత్ దీపాల‌తో అలంక‌రించారు.

 

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..