వెంటాడుతా: అక్షయ్ కుమార్‌కు పోటీ ఇస్తున్న కార్తీక్ ఆర్యన్..

by  |
వెంటాడుతా: అక్షయ్ కుమార్‌కు పోటీ ఇస్తున్న కార్తీక్ ఆర్యన్..
X

దిశ, సినిమా : బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ హార్రర్ కామెడీ పిక్చర్‌ ‘భూల్ బులయ్యా’ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ మూవీకి సీక్వెల్‌గా ‘భూల్ బులయ్యా 2’ రాబోతోంది. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ నుంచి మోషన్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా.. కార్తీక్ స్టైలిష్ కమ్ హారర్ లుక్‌కు మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అనిస్ బాజ్మీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో టబు, కియారా అద్వానీలు ప్రధాన పాత్రల్లో కనిపించబోతుండగా.. 25 మార్చి, 2022లో మూవీ థియాట్రికల్ రిలీజ్ ఉంటుందని ప్రకటించారు. కాగా నవంబర్ 19, 2021లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొవిడ్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed