‘మిరాకిల్’ కథపై కాపీ ఆరోపణలు

by  |
‘మిరాకిల్’ కథపై కాపీ ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: అమెజాన్ ప్రైమ్‌లో రీసెంట్‌గా విడుదలైన సిరీస్ ‘పుతమ్ పుదు కాలై’. ప్రముఖ దర్శకులైన గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్, సుధ కొంగర, సుహాసిని మణిరత్నం, కార్తీక్ సుబ్బరాజులు ఒక్కొక్కరు ఒక్కో కథను తెరకెక్కించారు. అలా మొత్తంగా ఐదు కథలతో ‘పుతమ్ పుదు కాలై’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సిరీస్‌లోని మిరాకిల్ అనే కథకు పిజ్జా ఫేం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా.. ఈ స్టోరీని తన వద్ద నుంచి కాపీ కొట్టారని రచయిత అజయన్ బాల ఆరోపిస్తున్నాడు.

ఇద్దరు దొంగలు ఓ ప్రొడ్యూసర్ లైఫ్‌ను ఎలా సేవ్ చేశారన్న ఇతివృత్తంతో కార్తీక్ సుబ్బరాజు ‘మిరాకిల్’ను రూపొందించాడు. కాగా తాను తీసిన షార్ట్ ఫిల్మ్ ‘సచిన్ క్రికెట్ క్లబ్’ నుంచి ఈ కథను కాపీ చేశాడని రైటర్, డైరెక్టర్ అజయన్ బాల ఆరోపిస్తున్నాడు. ‘నా కథలో డే టైమ్‌లో మొత్తంగా పది మంది, నైట్ టైమ్‌లో రెండు పాత్రలు మాత్రమే ఉంటాయి. ఇక చిత్ర కథకు వస్తే.. అత్యాశతోనే మనం ఎక్కువగా నష్టపోతామని, తప్పుడు పనికోసం చేతిలో ఉన్న డబ్బును వినియోగిస్తే.. ఆ డబ్బుల్ని కూడా కోల్పోతామన్నది కథ. ఇక క్లైమాక్స్‌లో ఆ డబ్బులు ఫేక్ అని తెలుస్తుంది’ అని బాల తెలుపుతూ.. మిరాకిల్ కూడా సేమ్ ఇలానే ఉందన్నాడు. సచిన్ క్రికెట్ క్లబ్ సినిమా యూట్యూబ్‌లో గత నెలలోనే విడుదల చేశానని ఆయన తెలిపాడు. ‘పుతమ్ పుదు కాలై’లోని మిరాకిల్ భాగం చూడమని తన స్నేహితుడు చెప్పడంతో చూశానని, నా షార్ట్ ఫిల్మ్ చూసి.. కార్తీక్ సుబ్బరాజు కాపీ చేశాడని ఆయన ఆరోపించాడు. విషయం తెలుసుకున్న నెటిజన్లు.. కార్తీక్ సుబ్బరాజు కాపీ క్యాట్ అంటూ మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక కార్తీక్ సుబ్బరాజు విషయానికి వస్తే.. పిజ్జా మూవీతో పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు.. జిగర్‌తండా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీతో ‘పేట’ సినిమా చేసినప్పటికీ ఆశించనంత విజయం దక్కలేదు. తాజాగా ధనుష్ హీరోగా 'జగమే తంత్రమ్' చిత్రాన్ని రూపొందించాడు. ఈ మూవీ త్వరలో రిలీజ్ కాబోతోంది. మరి అజయన్ బాల ఆరోపణలపై కార్తీక్ ఇంతవరకు ఏమీ స్పందించలేదు.


Next Story

Most Viewed