న్యూస్‌ అమ్ముకున్న యాంకర్.. ప్రేమ, టీఆర్పీల మధ్య నలిగిపోయిన యువకుడు

by  |
HIT-12
X

దిశ, సినిమా: కార్తిక్ ఆర్యన్ – రామ్ మద్వానీల ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ ఫిల్మ్ ‘ధమాకా’ ట్రైలర్ అదిరిపోయింది. నెట్‌ఫ్లిక్స్‌ థ్రిల్లర్‌గా వస్తున్న సినిమాలో న్యూస్ యాంకర్ అర్జున్ పాటక్‌గా కనిపించిన కార్తిక్ లైఫ్ ఓ టెర్రరిస్ట్ కాల్‌తో ఎలాంటి మలుపులు తిరిగింది? సినిమాలో మృణాల్ ఠాకూర్ కార్తిక్ భార్యగా కనిపించగా.. తనను కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేశాడు? టెర్రరిస్ట్ అటాక్ నుంచి ముంబైని కాపాడాడా లేదా? అనేది స్టోరీ.

DHAMAKA : Trailer Talk

ఓ న్యూస్ చానల్‌లో ప్రైమ్ టైమ్ ప్రజెంటర్‌గా పనిచేసే అర్జున్ అనుకోకుండా జాబ్ కోల్పోతాడు. ఆ తర్వాత ఓ రేడీయో స్టేషన్‌లో జాకీగా జాయిన్ అవుతాడు. ఆ టైమ్‌లో ముంబైలోని బాంద్రా- ఓర్లీ సముద్రం లింక్‌పై బాంబ్ బ్లాస్ట్ జరగనుందని టెర్రరిస్ట్ నుంచి కాల్ వస్తుంది. ఇది నిజమే అని కన్‌ఫర్మ్ అయిన అర్జున్.. ఈ న్యూస్‌తో ప్రైమ్ టైమ్ పీరియడ్ కావాలని న్యూస్ చానల్ యాజమాన్ని డిమాండ్ చేస్తాడు. దీనికి తలొగ్గిన మీడియా చానల్.. రేటింగ్స్‌ను పెంచుకుంటూ న్యూస్‌ను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, ఆ తర్వాత టెర్రరిస్ట్ నుంచి ఎలాంటి డిమాండ్స్ వచ్చాయి? తను ప్రేమించిన వ్యక్తిపై అటాక్ జరుగుతుందంటే అర్జున్ టెర్రరిస్ట్ చెప్పినట్లు చేశాడా? టీఆర్పీ, లవ్ మధ్య నలిగిపోయిన అర్జున్.. చివరకు ఏం చేశాడు? ప్రైమ్ టైమ్ సక్సెస్ అయిందా? టెర్రరిస్ట్‌ అటాక్‌ను అడ్డుకోగలిగాడా లేదా? అనేది కథ. మొత్తానికి రామ్ మద్వానీ ధమాకా ట్రైలర్ వదిలాడని, ఈ సినిమాతో కార్తిక్ ఆర్యన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకునేట్లుగానే ఉన్నాడంటున్న ఫ్యాన్స్.. నవంబర్ 19న స్ట్రీమ్ కానున్న మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.



Next Story

Most Viewed