నెట్‌ఫ్లిక్స్‌ క్రైమ్ స్టోరీస్‌ను బ్లాక్ చేసిన హైకోర్టు

by  |
Crime Stories: India Detective
X

దిశ, సినిమా: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో ప్రసారమవుతున్న క్రైమ్ స్టోరీస్‌ను నిలిపేయాలని కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుల్లో ఒకరైన వ్యక్తి అభ్యర్థన ఆధారంగా ‘ఏ మర్డర్డ్ మదర్’ పేరు గల క్రైమ్ స్టోరీస్ : ఇండియా డిటెక్టివ్స్ డాక్యుమెంట్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్‌ను టెలికాస్ట్ చేయకూడదని ఆదేశించింది. నిర్మల చంద్రశేఖర్ (54) అనే వ్యక్తిని ఆమె కూతురు అమృత, సహ నిందితుడు శ్రీధర్ రావు సాయంతో హత్య చేసినట్లు బెంగళూరు పోలీసుల దర్యాప్తులో ఒప్పుకున్న వీడియోను ఈ ఎపిసోడ్‌లో చూపించారు. అయితే, అమృతతో పాటు అరెస్టయిన శ్రీధర్ రావు ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఇది అతని గోప్యతను ఉల్లంఘించడమే కాకుండా ప్రజల నుంచి వేధింపులకు గురయ్యే అవకాశముందని ఆయన తరఫున న్యాయవాది వాదించారు.

కాగా, ఈ సిరీస్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. తదుపరి ఆదేశాలకు లోబడి స్ట్రీమింగ్, బ్రాడ్‌కాస్టింగ్, టెలికాస్టింగ్ లేదా ఎపిసోడ్ నం 1లోని కంటెంట్‌ను బ్లాక్ చేయమని ప్రతివాదులకు పిలుపునిచ్చింది. దీంతో ఈ ఉత్తర్వులకు లోబడి నెట్‌ఫ్లిక్స్ సదరు ఎపిసోడ్‌ను అందుబాటులో లేకుండా చేసింది. ఇక బెంగళూరులో జరిగిన రియల్ క్రైమ్స్‌ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌లోని మొదటి నాలుగు ఎపిసోడ్‌లు ప్రస్తుతం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయి.


Next Story

Most Viewed