కంటోన్మెంట్‌లో 21 నామినేషన్‌లు ఆమోదం

by Disha Web Desk 23 |
కంటోన్మెంట్‌లో 21 నామినేషన్‌లు ఆమోదం
X

దిశ,మేడ్చల్ బ్యూరో: కంటోన్మెంట్ నియోజకవర్గంలో బరిలో నిలిచేందుకు వేసిన నామినేషన్లలో మూడు తిరస్కరణ గురై 21 నామినేషన్లు ఆమోదం పొందినట్లు ఎన్నికల అధికారి మధుకర్ నాయక్ తెలిపారు. నియోజవర్గంలో మొత్తం 24 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో బీజేపీ పార్టీ తరఫునుంచి అభ్యర్థిగా ఎం ఏ శ్రీనివాస్ నామినేషన్ వేసిన రెండు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఫామ్ ఏ, ఫామ్ బి పత్రాలు సమర్పించకపోవడంతో పాటుగా ప్రపోజల్ కూడా లేకపోవడంతో అతని నామినేషన్ రిజెక్ట్ అయింది. అదేవిధంగా ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసిన బంగారి రాజు నామినేషన్ కూడా రిజెక్ట్ అయింది. ఇతనికి పదిమంది ప్రపోజల్స్ అవసరం ఉండగా 9 మంది మాత్రమే ప్రపోజల్స్ ఉన్నారు. దీంతో అతని నామినేషన్ రిజెక్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక ఆ లయన్స్ ఆఫ్ డెమో ట్రిక్ పార్టీ తరఫునుంచి నామినేషన్ వేసిన కాంగ్రెస్ మహిళా నేత నాగినేని సరిత తన నామినేషన్ పత్రాలలో పొందుపరిచిన అఫిడవిట్లో పూర్తి సమాచారం అందించకపోవడంతో ఆమె నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు.

సర్వే కాంగ్రెస్ రెబల్ నామినేషన్ తిరస్కరణ...

మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి రెండు నామినేషన్లు వేశారు. కాగా ఆ నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. అయితే ఆయన మొత్తం నాలుగు నామినేషన్లు వేయగా అందులో రెండు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వేశారు. మిగిలిన రెండు నామినేషన్లు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేసిన నామినేషన్ మాత్రం అధికారులు ఆమోదించారు.



Next Story

Most Viewed