తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందంటే.. అది వాళ్ల గొప్పతనమే: రేవంత్ ఎమోషనల్ కామెంట్స్

by Satheesh |
తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందంటే.. అది వాళ్ల గొప్పతనమే: రేవంత్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ కార్యకర్తలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. భుజం కాయలు కాసేలా కార్యకర్తలు కాంగ్రెస్ జెండా మోశారని.. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది వాళ్ల గొప్పతనమేనని రేవంత్ రెడ్డి కొనియాడారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ శుక్రవారం సంగారెడ్డి జిల్లా భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి నష్టమని తెలిసిన.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నేరవేర్చాలని సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు.

కానీ సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ పదేళ్ల పాటు కేసీఆర్ కబందహస్తాల్లో చిక్కుకుందని.. డిసెంబర్ 9న కేసీఆర్ గడీలు బద్దలు కొట్టి రాష్ట్రంలో ప్రజాపాలన తెచ్చుకున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేశామని తెలిపారు. పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందాలని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకం తెచ్చిందని.. కానీ కేసీఆర్ సర్కార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని పదేళ్ల పాటు నిర్లక్ష్యానికి గురి చేసిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాగానే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10లక్షలకు పెంచామని స్పష్టం చేశారు.

Read More...

BREAKING: ప్రధాని మోడీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలుNext Story

Most Viewed