అమెజాన్‌ ప్రైమ్‌లో మరో కోలీవుడ్ బ్లాక్ బస్టర్

by  |
అమెజాన్‌ ప్రైమ్‌లో మరో కోలీవుడ్ బ్లాక్ బస్టర్
X

దిశ, సినిమా : అమెజాన్ ప్రైమ్‌లో మరో కోలీవుడ్ బ్లాక్ బస్టర్ సందడి చేయబోతోంది. ‘మాస్టర్’ సక్సెస్‌ఫుల్ డిజిటల్ ప్రీమియర్ తర్వాత మరో తమిళ్ యాక్షన్ ఫిల్మ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్‌లో రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకున్న సూపర్ స్టార్ ధనుష్ ‘కర్ణన్’ ఈ నెల 14న ప్రైమ్‌లో రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఊరి హక్కుల కోసం పోరాడే యువకుడి కథే ‘కర్ణన్’ కాగా.. తక్కువ కులంపై పోలీసుల జులుం, తర్వాత జరిగే పరిణామాల చూట్టూ స్టోరీ ముడిపడి ఉంటుంది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాను వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలైపులి యస్ థాను నిర్మించగా సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. లాల్ పాల్, నటరాజన్ సుబ్రమణియన్, యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించారు.



Next Story

Most Viewed