కర్ణన్’ పవర్‌ఫుల్ లుక్.. వారియర్‌గా ధనుష్

by  |
కర్ణన్’ పవర్‌ఫుల్ లుక్.. వారియర్‌గా ధనుష్
X

దిశ, సినిమా : కోలీవుడ్ హీరో ధనుష్ ‘కర్ణన్’ ఫస్ట్ లుక్ రిలీజైంది. చేతులకు బేడీలు, రక్తంతో ఉన్న ఇంటెన్స్ లుక్ సినిమాపై హైప్ క్రియేట్ చేయగా.. తన భూమి, ప్రజల కోసం పోరాడుతున్న యోధుడిగా కనిపించనున్నాడు ధనుష్. ‘న్యాయం యొక్క ఆత్మ ఎప్పటికీ చనిపోదు’ అనే క్యాప్షన్‌తో ఫస్ట్ లుక్ షేర్ చేసిన మూవీ యూనిట్.. ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్‌గా సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరి సెల్వరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్.. తిరున్యవేలికి సమీపంలో ఉన్న ఓ ఎస్టేట్‌లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కలైపులి యస్ థాను నిర్మిస్తున్న సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. కాగా ఇప్పటికే రిలీజైన రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రోమోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోగా.. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ సినిమాకు బిగ్ అస్సెట్ కానుంది.

Next Story

Most Viewed