- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్ పాలన.. ఆంధ్రా పాలకుల మాదిరిగానే ఉంది
by Sridhar Babu |
<p>దిశ, వేములవాడ: టీఆర్ఎస్ పాలన అచ్చం.. ఆంధ్రా పాలకుల మాదిరిగానే ఉందని, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యం అని కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ అన్నారు. గురువారం వేములవాడలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణను తుల ఉమ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరికపై, భవిష్యత్ కార్యచరణపై గంటకుపైగా చర్చించారు. సందర్భంగా తుల ఉమ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేవలం కుటుంబ పాలన సాగుతోందని, ప్రశ్నించిన గొంతులను […]</p>

X
దిశ, వేములవాడ: టీఆర్ఎస్ పాలన అచ్చం.. ఆంధ్రా పాలకుల మాదిరిగానే ఉందని, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యం అని కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ అన్నారు. గురువారం వేములవాడలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణను తుల ఉమ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరికపై, భవిష్యత్ కార్యచరణపై గంటకుపైగా చర్చించారు. సందర్భంగా తుల ఉమ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేవలం కుటుంబ పాలన సాగుతోందని, ప్రశ్నించిన గొంతులను నొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో అందరం బాగుపడాలని పోరాటాలు చేస్తే.. కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందని అన్నారు. అందుకే రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి అందరూ కలిసిగట్టుగా పోరాడటానికి నడుంబిగిచాలని సూచించారు.
Next Story






