టబు సినిమా బడ్జెట్.. కరీనా కాస్ట్యూమ్స్ కన్నా తక్కువే!

by  |
టబు సినిమా బడ్జెట్.. కరీనా కాస్ట్యూమ్స్ కన్నా తక్కువే!
X

దిశ, సినిమా: డైరెక్టర్ మధుర్ భండార్కర్‌ను రియలిస్టిక్, హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్ మేకర్‌గా నిలబెట్టిన సినిమా ‘చాందిని బార్’. ఈ మూవీ రిలీజై 20 ఏళ్లు కాగా.. ఇందుకు సంబంధించిన విషయాలు షేర్ చేశాడు. ఆ టైమ్‌లో కమర్షియల్ హీరోయిన్‌గా టాప్ ప్లేస్‌లో ఉన్న టబును దృష్టిలో ఉంచుకుని ఈ కథను సిద్ధం చేశానన్న ఆయన.. తన ఫస్ట్ అండ్ లాస్ట్ చాన్స్ తనే అని తెలిపాడు. ముంబైలో బార్ డ్యాన్సర్ క్యారెక్టర్‌లో ఇద్దరు పిల్లలకు తల్లిగా టబు నటించాల్సి ఉండగా.. స్టోరీ చెప్పిన వెంటనే ఎస్ చెప్పిందన్నాడు. తను నో చెప్తే చాలా నిరాశ చెందేవాడినని వివరించాడు. కాగా, తన ఫస్ట్ సినిమాతో పూర్తిగా డిజప్పాయింట్ అయ్యానని, ‘చాందిని బార్’ ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకున్న తను నిర్మాతలను సంప్రదిస్తే ఐటెమ్ సాంగ్స్ యాడ్ చేయాలని అన్నారని తెలిపాడు. కానీ అలా చేయడం తనకు ఇష్టం లేదని, కథను కథగా సీరియస్‌నెస్‌తో ప్రజెంట్ చేయాలని అనుకున్నట్లు తెలిపాడు. మొత్తానికి నాలుగు నేషనల్ అవార్డులు పొందిన ఈ సినిమా బడ్జెట్.. తన తర్వాతి చిత్రమైన ‘హీరోయిన్‌’లో కరీనా కపూర్ కస్ట్యూమ్స్ ఖర్చు కంటే కూడా తక్కువని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

Next Story

Most Viewed