- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాడ్ షూట్‌లో కపూర్ సిస్టర్స్!
<p>బాలీవుడ్ స్టార్ సిస్టర్స్ కరీనా కపూర్, కరిష్మా కపూర్ కలిసి ఓ యాడ్ షూట్‌లో పాల్గొంటున్నారు. ముంబైలోని కరీనా ఇంట్లోనే యాడ్ షూటింగ్ జరుగుతుండగా.. ఇద్దరూ కూడా వైట్ షర్ట్, డెనిమ్ జీన్స్‌లో ట్విన్నింగ్ పోజ్ ఇచ్చారు. ప్రెజెంట్ ఈ పిక్స్ నెట్టింట వైరల్ కాగా.. సిస్టర్‌తో పని చేయడం ఎప్పటికీ ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటూ ఫొటోలు షేర్ చేసింది కరిష్మా. ఈ ఫొటోల్లో కరీనా బేబీ బంప్ క్లియర్‌గా కనిపిస్తుండగా.. ప్రెగ్నెన్సీ గ్లోతో మరింత […]</p>

బాలీవుడ్ స్టార్ సిస్టర్స్ కరీనా కపూర్, కరిష్మా కపూర్ కలిసి ఓ యాడ్ షూట్‌లో పాల్గొంటున్నారు. ముంబైలోని కరీనా ఇంట్లోనే యాడ్ షూటింగ్ జరుగుతుండగా.. ఇద్దరూ కూడా వైట్ షర్ట్, డెనిమ్ జీన్స్‌లో ట్విన్నింగ్ పోజ్ ఇచ్చారు. ప్రెజెంట్ ఈ పిక్స్ నెట్టింట వైరల్ కాగా.. సిస్టర్‌తో పని చేయడం ఎప్పటికీ ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటూ ఫొటోలు షేర్ చేసింది కరిష్మా. ఈ ఫొటోల్లో కరీనా బేబీ బంప్ క్లియర్‌గా కనిపిస్తుండగా.. ప్రెగ్నెన్సీ గ్లోతో మరింత అందంగా ఉంది.
కాగా కరీనా ఈ మధ్యే ‘లాల్ సింగ్ చడ్డా’ షూటింగ్ పూర్తి చేసింది. అమీర్ ఖాన్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రం తనకు ఎప్పటికీ స్పెషల్ అని చెప్పిన కరీనా.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే, కళ ముందు అన్నీ దిగదుడుపే అని.. కళకు అందరూ సలామ్ చేయాల్సిందే అని చెప్పింది. కరోనా పరిస్థితుల్లోనూ షూటింగ్ పూర్తి చేయడం గర్వంగా ఉందని ఈ మధ్యే పోస్ట్ పెట్టింది.






