- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయండి..
<p>దిశ, సినిమా : బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్ కొవిడ్ కారణంగా వితంతువులుగా మారిన మహిళలకు సపోర్ట్‌గా నిలవాలని పిలుపునిస్తోంది. కరోనాతో జీవిత భాగస్వామిని కోల్పోయిన వారి బాధ వర్ణించలేమని, ఇలాంటి పరిస్థితుల్లో వారికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో కొవిడ్ విడోస్.ఇన్ (covidwidows.in) వెబ్‌సైట్ గురించి తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసిన కరీనా.. తమ పార్ట్‌నర్‌ను కోల్పోయి కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని మహిళల ఎంప్లాయిమెంట్ కోసం […]</p>

దిశ, సినిమా : బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్ కొవిడ్ కారణంగా వితంతువులుగా మారిన మహిళలకు సపోర్ట్‌గా నిలవాలని పిలుపునిస్తోంది. కరోనాతో జీవిత భాగస్వామిని కోల్పోయిన వారి బాధ వర్ణించలేమని, ఇలాంటి పరిస్థితుల్లో వారికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో కొవిడ్ విడోస్.ఇన్ (covidwidows.in) వెబ్‌సైట్ గురించి తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసిన కరీనా.. తమ పార్ట్‌నర్‌ను కోల్పోయి కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని మహిళల ఎంప్లాయిమెంట్ కోసం యుధ్‌వీర్ టీమ్ కృషి చేస్తోందని తెలిపింది. అవసరమున్న వారు ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పింది. అంతేకాదు డిప్రెషన్‌లో ఉన్న బాధిత మహిళలకు ఎక్స్‌పర్ట్స్‌చే కౌన్సిలింగ్ ఇప్పిస్తారని వివరించింది. దయచేసి ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయాలన్న కరీనా.. ఎవరైనా సరే ఈ ఇనిషియేటివ్‌కు సపోర్ట్ చేస్తూ వాలంటీర్‌గా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేయొచ్చని సూచించింది.






