- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నన్ను గజదొంగ అంటున్రు: ముద్రగడ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: కాపు ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఇటీవల కొందరు సామాజిక మాధ్యమాల్లో తనపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను కుల ద్రోహి, గజదొంగ వంటి వ్యాఖ్యలతో విమర్శిస్తున్నారని ఆయన వాపోయారు. కాపు ఉద్యమం ద్వారా తాను ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా నష్టపోయానని ఆయన వెల్లడించారు. జాతి ఉన్నతికోసం మేధావులతో కలిసి ఉద్యమం నడిపానని గుర్తుచేశారు. తాను రోజుకో […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: కాపు ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఇటీవల కొందరు సామాజిక మాధ్యమాల్లో తనపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను కుల ద్రోహి, గజదొంగ వంటి వ్యాఖ్యలతో విమర్శిస్తున్నారని ఆయన వాపోయారు.
కాపు ఉద్యమం ద్వారా తాను ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా నష్టపోయానని ఆయన వెల్లడించారు. జాతి ఉన్నతికోసం మేధావులతో కలిసి ఉద్యమం నడిపానని గుర్తుచేశారు. తాను రోజుకో మాట మాట్లాడుతున్నానంటూ విమర్శిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు బంతిని కేంద్రం కోర్టులో వేశాననడం బాధేస్తోందని తెలిపారు. సందర్భానుసారంగా ఉద్యమం రూపురేఖలు మార్చుకుంటోందని, తన జాతికి ఏదో విధంగా మేలు జరగాలని ఎన్నో ప్రయత్నాలు చేశానని లేఖలో వివరించారు.
Next Story






