కెప్టెన్ అయ్యాకా ఆయనకు భయపడ్డా: కపిల్

by  |
కెప్టెన్ అయ్యాకా ఆయనకు భయపడ్డా: కపిల్
X

దిశ, స్పోర్ట్స్: కెప్టెన్ అంటే జట్టులోని సభ్యులందరికీ గౌరవంతోపాటు కాస్త భయం కూడా ఉంటుంది. కానీ, అదే కెప్టెన్‌కు జట్టులోని సభ్యుడంటే భయపడితే? నిజంగా అలా జరుగుతుందా అనే అనుమానం కలుగుతుంది. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. అతని క్రికెట్ అరంగేట్రం బిషన్ సింగ్ బేడి నాయకత్వంలో జరిగింది. ఆ తర్వాత కెప్టెన్ ఎస్. వెంకటరాఘవన్ సారథ్యంలో ఆడారు. ఆయన్ని చూస్తేనే కపిల్‌కు భయమొచ్చేదంటా. కారణం అప్పటికి కపిల్ జూనియర్ కావడంతో చీటికి మాటికి అతనిపై చికాకు పడేవాళ్లు. అంతేకాకుండా కపిల్ కెప్టెన్సీలో రాఘవన్ కూడా ఆడారు. అప్పుడు వేరే వాళ్లకు బౌలింగ్ ఇస్తే ‘నేను బౌలింగ్ చేయనని చెప్పానా’ అని ప్రశ్నించేవారట. జట్టు సమావేశ సమయంలో కూడా రాఘవన్ కనిపిస్తే కపిల్ భయంతో మూలకు వెళ్లిపోయేవారట. చివరకు ఆయన అంపైర్ అయ్యాక ఎప్పుడైనా అప్పీల్ చేస్తే ఆయన నాటౌట్ ఇస్తే అదో మందలింపులాగానే ఉండేదని కపిల్ చెప్పారు. అయితే, ఆయనది ప్రేమించే స్వభావమేనని కపిల్ అన్నారు.

Next Story

Most Viewed