హ‌ృతిక్.. నీ డ్రామాలు ఆపెయ్ : కంగన

by  |
హ‌ృతిక్.. నీ డ్రామాలు ఆపెయ్ : కంగన
X

దిశ, వెబ్‌డెస్క్: నాలుగేళ్ల క్రితం హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య జరిగిన వార్ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. మీడియా, సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య యుద్ధం తారా స్థాయికి చేరి చల్లబడిపోయింది. కానీ ఇప్పుడు అదే వార్‌లో కొత్త చాప్టర్ మొదలు కాబోతుందనిపిస్తోంది. కంగన మెయిల్ నుంచి 2013, 14లో వందల సంఖ్యలో మెయిల్స్ వచ్చాయని ఆరోపిస్తూ 2016లో హృతిక్ కేసు నమోదు చేశారు. కాగా ఆ కేసు ఎఫ్ఐఆర్ ఇప్పుడు సైబర్ సెల్ నుంచి క్రైమ్ బ్రాంచ్ సీఐయూ(క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్)కు బదిలీ చేయబడింది. ఈ క్రమంలోనే దీనిపై సెటైరికల్‌గా స్పందించింది కంగన.

అతని విచారకరమైన కథ మళ్లీ మొదలవుతుందంటూ ట్వీట్ చేసింది. ‘మాకు బ్రేకప్ అయి చాలా ఏళ్లయింది. తనకు విడాకులై చాలా సంవత్సరాలైంది. అయినా ముందుకు సాగలేకపోతున్నాడు. మరో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లేందుకు భయపడిపోతున్నాడు. నేను నా వ్యక్తిగత జీవితంలో ధైర్యం, నమ్మకం తెచ్చుకుని ముందుకు సాగుతున్నా.. కానీ హృతిక్ మళ్లీ అదే నాటకాన్ని ప్రారంభించాడు’ అని చెప్పుకొచ్చిన కంగన.. ఒక్క చిన్న ఎఫైర్ కోసం ఎన్ని రోజులని ఏడుస్తావ్ హృతిక్ అంటూ కామెంట్ చేసింది. కాగా హృతిక్, కంగన చివరిసారిగా ‘క్రిష్ 3’ సినిమా కోసం కలిసి పనిచేశారు. ఈ టైమ్‌లోనే ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని కంగన ప్రకటించగా.. ఈ ఆరోపణలను ఖండించాడు హృతిక్.

Next Story