అంటే.. షారుక్ కన్నా నేనే గ్రేట్ : కంగన

by  |
అంటే.. షారుక్ కన్నా నేనే గ్రేట్ : కంగన
X

దిశ, సినిమా : ‘గ్యాంగ్ స్టర్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా కంగనా రనౌత్.. తన 15 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌లు చూశానని తెలిపింది. తాను, షారుఖ్ ఖాన్ బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీస్ కలిగి ఉన్నామంటూ తనను షారుఖ్‌తో పోల్చుకున్న కంగన.. కానీ కింగ్ ఖాన్ కన్నా తనే గ్రేట్ అనే లెవల్‌లో ట్వీట్ చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన షారుఖ్ కాన్వెంట్‌లో చదివాడని, తన తండ్రి అప్పటికే సినిమాల్లో ఉన్నారని, అందుకే సక్సెస్ అయ్యాడని కంగన తెలిపింది.

తాను హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ రిమోట్ విలేజ్ నుంచి వచ్చానని, ఒక్క ముక్క ఇంగ్లిష్ కూడా రాదని, అయినా సరే ఇంత గొప్ప విజయాలను అందుకున్నానని చెప్పింది. తన లైఫ్‌లో ప్రతీ స్టెప్‌లోనూ యుద్ధం చేశానని తెలిపిన కంగన.. తాత, తండ్రి తన జీవితాన్ని దుర్భరంగా మార్చారని వివరించింది. 15 ఏళ్ల సక్సెస్ జర్నీ తర్వాత కూడా మనుగడ కోసం ప్రతీ రోజు పోరాటం చేయాల్సి వస్తుందని, కానీ ఇది విలువైనదని తెలిపింది.


Next Story

Most Viewed