యాక్షన్ ట్రైనింగ్‌లో కంగన

by  |
యాక్షన్ ట్రైనింగ్‌లో కంగన
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కెరీర్‌లో రేసుగుర్రంలా పరుగెడుతోంది. ప్రస్తుతం జయలలిత బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘తలైవి’లో నటిస్తున్న కంగన.. ఆ చిత్ర షూటింగ్ కోసం మనాలి నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. అటు ‘తలైవి’ షూటింగ్ ప్యాకప్ చెప్పిన తర్వాత, తన యాక్షన్ ఫ్లిక్ మూవీ ‘ధాకడ్’ కోసం యాక్షన్ రిహార్సల్స్ చేస్తోంది కంగన. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

‘నాకు మల్టీ టాస్క్ చేయడమంటే ఇష్టముండదు. కానీ కెరీర్ బిగినింగ్‌లో మాత్రం రేసుగుర్రంలా పనిచేసేదాన్ని. మళ్లీ ఇప్పుడు అప్పటిలా పని చేస్తున్నాను. ‘తలైవి’ సినిమా షూటింగ్ చేస్తూనే, ధాకడ్ కోసం జాసన్ ఎన్జీ ఆధ్వర్యంలో యాక్షన్ రిహార్సల్స్ చేస్తున్నాను. అంతేకాదు నా చార్మింగ్ డైరెక్టర్ రజనీష్ గయ్‌తో సీన్స్ డిస్కస్ చేస్తున్నాను’ అంటూ కంగన తన ట్వీట్‌లో పేర్కొంది.

‘ధాకడ్’ సినిమాను గత సంవత్సరమే అనౌన్స్ చేసినా, కరోనా నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడింది. గతంలోనే పోస్టర్, టీజర్ విడుదలైన ఈ సినిమా.. ఫుల్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోంది. ఇందులో కంగన యాక్షన్ అవతార్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు రజనీష్ గయ్ దర్శకత్వం వహిస్తుండగా, సోహెల్ మాక్‌లయ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తలైవి, ధాకడ్ సినిమాలతో పాటు సర్వేష్ మేవారా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘తేజస్’ చిత్రంలోనూ కంగన లీడ్ రోల్ పోషిస్తోంది. ఇందులో ఆమె ఫైటర్ పైలట్‌గా అలరించనుంది.

Next Story

Most Viewed