అభిమానిలో జీవించడం ఆనందమే : కమల్

by  |
అభిమానిలో జీవించడం ఆనందమే : కమల్
X

లోకనాయకుడు కమల్ హాసన్ వీరాభిమాని అశ్విన్ కుమార్.. కమల్ను ఇమిటేట్ చేయడంలో మేటి. అచ్చం కమల్ వలెనే నటించడం, డ్యాన్స్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయిన అశ్విన్.. కొత్తగా ట్రెడ్‌మిల్‌పై ‘అన్నాత్తే అడురార్’ సాంగ్‌పై వేసిన స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది కాస్త కమల్ దగ్గరికి చేరడంతో.. ఆయన దీనిపై స్పందించారు.

‘నాలో ఉన్న చిన్న కదలిక కూడా అదే మాదిరిగా నా అభిమాని పొందడం చూస్తుంటే గర్వంగా ఉంది. కళాకారులందరికీ ఇదే సందేహం ఉన్నా.. నాకు మాత్రం ఆనందంగా ఉందని’ తెలిపారు. తనను ఆశీర్వదించిన కమల్.. మీ ద్వారా తరతరాలుగా నన్ను నేను అధిగమించడం నా కర్తవ్యం అని తెలిపారు. కాగా కమల్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు. ప్రమాదం కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Next Story

Most Viewed