- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు ఉదయం నుంచే బల్కంపేట ఎల్లమ్మ గుడిలో..
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం జరగనున్న అమ్మవారి కళ్యాణం ఏర్పాట్లను ఆయన సోమవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉదయం 9 గంటల నుంచే కళ్యాణానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని, 11.30 గంటలకు అమ్మవారి కళ్యాణం నిర్వహిస్తామన్నారు. అమ్మవారి కళ్యాణానికి నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, […]</p>

X
దిశ, హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం జరగనున్న అమ్మవారి కళ్యాణం ఏర్పాట్లను ఆయన సోమవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉదయం 9 గంటల నుంచే కళ్యాణానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని, 11.30 గంటలకు అమ్మవారి కళ్యాణం నిర్వహిస్తామన్నారు. అమ్మవారి కళ్యాణానికి నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, దానిని దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మాస్క్‌లు, శానిటైజర్‌లను అందుబాటులో ఉంచుతున్నట్లు తలసాని వెల్లడించారు.
Next Story






