‘లైవ్ టెలికాస్ట్’లో కాజల్‌కు భయంకరమైన ఎక్స్‌పీరియన్స్

by  |
‘లైవ్ టెలికాస్ట్’లో కాజల్‌కు భయంకరమైన ఎక్స్‌పీరియన్స్
X

దిశ, సినిమా : హీరోయిన్ కాజల్ అగర్వాల్ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సిరీస్ ‘లైవ్ టెలికాస్ట్’. వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సిరీస్ ఫిబ్రవరి 12 నుంచి హాట్‌స్టార్‌లో ప్రీమియం కాబోతుండగా.. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ గ్రిప్పింగ్‌గా ఉంది. కథ విషయానికొస్తే, ఓ టీవీ చానెల్‌కు చెందిన ఎంప్లాయిస్.. టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు ఒక ఇంట్లో దెయ్యం ఉందని క్రియేట్ చేసి, లైవ్ టెలికాస్ట్ షో ప్లాన్ చేస్తారు. కానీ ఆ ఇంట్లో నిజంగానే సూపర్ నేచురల్ పవర్స్ ఉన్నాయని.. అవే తమను ట్రాప్ చేశాయని తెలుసుకొని రియలైజ్ అవుతారు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది సిరీస్.

వైభవ్, ఆనంది కీలక పాత్రల్లో కనిపించబోతున్న ఈ సిరీస్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కగా.. ఇందుకు సంబంధించిన షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి వివరించింది కాజల్. ఐసోలేటెడ్ లొకేషన్‌లో ‘లైవ్ టెలికాస్ట్’ చిత్రీకరణ జరిగిందన్న భామ.. ఆ ప్రదేశం ఇందుకు పర్‌ఫెక్ట్ ప్లేస్‌గా భావిస్తున్నట్లు తెలిపింది. డైరెక్టర్ వెంకట్ ప్రభు ఫ్రెండ్ ఇంట్లో సిరీస్ చిత్రీకరణ జరగ్గా.. ఈ ఇల్లు కొండపై ఏకాంతంగా ఉండేదని చెప్పింది. షూటింగ్ జరిగినంత వరకు ఎంజాయ్ చేసేదాన్నని.. కానీ ప్యాకప్ చెప్పగానే చాలా భయమేసేదని తెలిపింది. సిరీస్ చిత్రీకరణ జరిగినంత కాలం భయంతో నిద్రకూడా పోలేదని చెప్పింది. అక్కడ ఉన్నంతసేపు క్యారెక్టర్‌లోనే ఉన్న ఫీలింగ్ కలిగిందని.. ఆన్ సెట్, ఆఫ్ సెట్ భయపడుతూనే ఉండేదాన్నని వివరించింది కాజోల్.



Next Story

Most Viewed