చందమామ నిశ్చితార్థం అయిపోయిందోచ్!

by  |
చందమామ నిశ్చితార్థం అయిపోయిందోచ్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ చందమామ.. అక్టోబర్ 30న పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ముంబయికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లు, కాజల్‌ల ప్రేమ బంధం.. మూడుముళ్లతో ఒక్కటి కానుంది. కరోనా మహమ్మారి కారణంగా అతితక్కువ మంది బంధువులు సమక్షంలో ముంబయిలో ఈ వేడుక జరగనుండగా.. టాలీవుడ్ నుంచి ఎవరినీ ఆహ్వానించలేదని సమాచారం. కానీ తన స్నేహితుడు, యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం కాజల్ పెళ్లికి హాజరవుతున్నట్లు స్పష్టం చేశాడు. అయితే అందరికీ పెళ్లి తర్వాత బిగ్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా తన ఎంగేజ్‌మెంట్ పూర్తయినట్లు కాజల్ అభిమానులకు చెప్పకనే చెప్పింది. తన ఇన్‌స్టా వేదికగా ‘షాది వానిటీ’ పేరుతో తన వేలికి ఉన్న రింగ్‌ను చూపించిన ఈ మిత్రవింద.. ఆ తరువాత సూపర్‌, ఓకే అంటూ వేళ్లతో చూపించింది.

మరోవైపు గౌతమ్‌ కిచ్లు కూడా తన ఇన్‌స్టాలో ‘వెడ్డింగ్ షాపింగ్‌.. నా పెళ్లి దుస్తులను ఏ డిజైనర్‌ సిద్ధం చేస్తున్నారని అనుకుంటున్నారు?’ అంటూ ఓ సస్పెన్స్ క్రియేట్ చేసేలా కామెంట్ చేశాడు. కాగా పెళ్లి తరువాత కూడా తాను సినిమాల్లో నటిస్తానని కాజల్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పెళ్లి అయిపోయిన రెండు వారాల తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొననుంది. ప్ర‌స్తుతం ‘ఇండియ‌న్ 2, మోసగాళ్లు, ఆచార్య’ సినిమాల‌తో పాటు లైవ్ టెలీకాస్ట్ అనే వెబ్ సిరీస్‌ల‌తో బిజీగా ఉంది.



Next Story

Most Viewed