మహానటి లుక్‌కు కాజల్ ఫిదా!

by  |
మహానటి లుక్‌కు కాజల్ ఫిదా!
X

దిశ, వెబ్‌డెస్క్ : బబ్లీ బ్యూటీ కీర్తీ సురేష్, యంగ్ హీరో నితిన్‌ ‘రంగ్ దే’ షూటింగ్‌ గ్యాప్‌లో తెగ హంగామా చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా చాలారోజులుగా ఇంటిపట్టునే ఉన్న కీర్తి.. ‘రంగ్‌దే’ కోసం దుబాయ్ వెళ్లింది. షూటింగ్ గ్యాప్‌లో అక్కడి టూరిస్ట్ ప్రదేశాల్లో కీర్తి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకోగా.. టాలీవుడ్ బ్యూటీ క్వీన్ కాజల్ ‘సో క్యూట్’ అని కాంప్లిమెంట్స్ అందించింది. ఇక స్మైలింగ్ డాల్ రాశీ ఖన్నా ‘లవ్ ఎమోటికన్స్’‌తో కీర్తిపై ప్రేమను తెలియజేసింది. ‘రంగ్‌దే’ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఏమిటో ఇది’ పాట మ్యూజిక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమా 2021లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే కీర్తి నటించిన ‘గుడ్ లఖ్ సఖి’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు కీర్తి ‘అన్నాత్తే, సర్కారు వారి పాట’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.



Next Story

Most Viewed