ప్రెగ్నెంట్ అయిన కాజల్.. అధికారికంగా ప్రకటన..?

by  |
ప్రెగ్నెంట్ అయిన కాజల్.. అధికారికంగా ప్రకటన..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత దూకుడు తగ్గించిందన్న విషయం అందరికి తెలిసిందే. అడపాదడపా సినిమాలను ఫినిష్ చేసిన అమ్మడు ప్రస్తుతం ఫోటో షూట్లలో బిజీగా ఉంది. ఇక గత కొన్ని రోజులుగా కాజల్ గర్భవతి అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. ఈ విషయం గురించి కాజల్ కూడా నోరు మెదపకపోవడంతో ఇది నిజమే అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే, కాజల్ జంట నుంచి అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు వారు గుడ్ న్యూస్ చెప్పేలానే ఉన్నారు. తాజాగా కాజల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో ‘ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ కమింగ్‌ సూన్‌..స్టే ట్యూన్‌డ్‌’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆ అనౌన్స్‌మెంట్ ఖచ్చితంగా ప్రెగ్నెంట్ విషయమే అని అభిమానులు గుసగుసలాడుతున్నారు. ప్రస్తుతం కాజల్ చిరంజీవితో ఆచార్య, నాగార్జునతో ఘోస్ట్‌ చిత్రాల్లో నటిస్తోంది. మరి ఈ చందమామ చెప్పే ఆ గుడ్ న్యూస్.. పర్సనలా..? ప్రొఫెషనలా ..? అని అభిమానులందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.



Next Story

Most Viewed