Kajal Aggarwal: ఫ్యూచర్ ప్రశ్నార్థకంలో పడినట్లేనా?

by  |
Kajal-Agarwal
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు కమిట్ అవుతోంది. ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ హిందీ ప్రాజెక్ట్ ‘ఉమ’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భామ.. లేటెస్ట్‌గా మరో తమిళ్ మూవీకి కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం కాజల్ కెరియర్‌ను బ్రేక్ చేసే అవకాశం లేకపోలేదని చెప్తున్నారు నిపుణులు.

ఇందులో కాజల్ తల్లిపాత్రలో కనిపించడమే కారణం కాగా.. ఒక వేళ ఈ క్యారెక్టర్ కాస్త నెగెటివిటీని తీసుకొచ్చినా ఫ్యూచర్ ప్రశ్నార్థకంలో పడినట్లేనని అభిప్రాయపడుతున్నారు. తల్లీకూతుళ్ల మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాలో కింగ్ నాగార్జున గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతుండగా.. కాజల్ వేశ్యగా కనిపించబోతోందని కోలీవుడ్ టాక్. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘రౌడీ బేబి’ టైటిల్ ఫైనల్ కాగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీ రోల్ ప్లే చేయనున్నారు.



Next Story