- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చందమామకు పెళ్లి.. వరుడు అతడే?
<p>దిశ, వెబ్‌డెస్క్: అందాల చందమామ కాజల్ అగర్వాల్ కళ్యాణం చేసుకోబోతుంది. ప్రముఖ వ్యాపారవేత్తతో ఇప్పటికే కాజల్ నిశ్చితార్థం కూడా జరిగిపోయినట్లు గతంతో వార్తలు రాగా.. తన పేరు గౌతమ్ కిచ్లు అని తెలిసింది. అతడు ఇంటీరియర్ డిజైన్, గృహాలంకరణ ఉపకరణాలలో ప్రత్యేక ఈకామర్స్ వెంచర్ కలిగి ఉన్నాడని సమాచారం. గౌతమ్ ఇంతకుముందు ఫ్యాబ్ ఫర్నిష్ వైస్ ప్రెసిడెంట్‌గా, ఎలిఫెంట్ కంపెనీ సీఈఓగా కూడా పనిచేశారు. కాజల్.. తన తల్లిదండ్రులు ఎంపిక చేసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటుండగా, పెళ్లి […]</p>

దిశ, వెబ్‌డెస్క్:
అందాల చందమామ కాజల్ అగర్వాల్ కళ్యాణం చేసుకోబోతుంది. ప్రముఖ వ్యాపారవేత్తతో ఇప్పటికే కాజల్ నిశ్చితార్థం కూడా జరిగిపోయినట్లు గతంతో వార్తలు రాగా.. తన పేరు గౌతమ్ కిచ్లు అని తెలిసింది. అతడు ఇంటీరియర్ డిజైన్, గృహాలంకరణ ఉపకరణాలలో ప్రత్యేక ఈకామర్స్ వెంచర్ కలిగి ఉన్నాడని సమాచారం. గౌతమ్ ఇంతకుముందు ఫ్యాబ్ ఫర్నిష్ వైస్ ప్రెసిడెంట్‌గా, ఎలిఫెంట్ కంపెనీ సీఈఓగా కూడా పనిచేశారు.
కాజల్.. తన తల్లిదండ్రులు ఎంపిక చేసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటుండగా, పెళ్లి ముంబైలో ఉండబోతుందని తెలుస్తోంది. చర్చ్ గేట్‌లోని ఫైవ్ స్టార్ హోటల్‌లో రెండు రోజుల వివాహ వేడుకను నిర్ణయించారని టాక్. కాగా, పంచదార బొమ్మ పెళ్లి వార్త విని అభిమానులు సంబురపడి పోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ కూడా హీరోయిన్ కాగా.. అక్క కన్నా ముందే లవ్ మ్యారేజ్ చేసుకుని చక్కగా సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం తనకు ఒక కొడుకు కూడా.






